బాబు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారు

తూర్పుగోదావరి))ప్రభుత్వం జనచైతన్యయాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి మండిపడ్డారు. కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప, నాగులచెరువు గ్రామాలలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీల అమలుపై గడపగడపలో ప్రజాబ్యాలెట్ అందించి బాబు పాలనపై మార్కులు వేయించారు. రుణాల మాఫీ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పింఛన్లు ఉన్నవికూడా కత్తిరిస్తున్నారు. ప్రతీ దాంట్లో ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రజలు పట్టాబివద్ద వాపోయారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ బాబు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారని పట్టాబి ఫైర్ అయ్యారు.


Back to Top