పెన్షన్

వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా ఫించన్లు అందే ఏర్పాటు చేేశారు. అది కూడా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకున్నారు.

ఆసరాలేని వృద్ధులు, వైకల్యం శాపంగా పరిణమించిన వారు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి వైఎస్సార్ అందించిన ఫించన్లు చేయూతనిచ్చాయి. పరిమిత ఫించన్లు, అర్హతలున్నా ఎవరో మరణిస్తే కాని మరొకరికి పింఛను ఇవ్వని దుస్థితి, కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను వైఎస్సార్ మార్చేసారు. కులమతాల పట్టింపు లేకుండా, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పింఛన్లు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

16లక్షలు మాత్రమే ఉన్న పింఛను వైఎస్ హయాంలో 71లక్షలు అయ్యాయి. అంటే 55లక్షల కొత్త పింఛన్ల మంజూరు జరిగింది. వితంతువులకు, వికలాంగులకు, మనోవైకల్యం ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేసి తన పెద్దమనసును చాటుకున్నారు వైఎస్సార్.

Back to Top