కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి



– ముడుపుల కోసమే పోలవరం టెండర్ల గడుపు పెంపు
– ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం కోసం మా పోరాటం ఆగదు
– వైయస్‌ జగన్‌ ఆదేశిస్తే ఎంపీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం
 
రాజమండ్రి: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రమే 2019లోగా నిర్మించి ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. పోలవరం టెండర్లను మళ్లీ పొడిగిస్తూ గడువు పెంచడం ఏంటని ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే..మళ్లీ కొత్త టెండర్లకు జనవరి 5వ తేదీ వరకు షెడ్యూల్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం వద్దు అన్నా కూడా మీరు కాంట్రాక్టర్లను మార్చుతారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం ముడుపుల కోసం టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను మార్చుకొని, వారి ముసుగులో దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చూస్తూ ఊరుకోమని, పోలవరంపై కేంద్రాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఒత్తిడి తెస్తుందని తెలిపారు. 2019 ఏప్రిల్‌లోగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని చెప్పారు. ఇదే విషయంపై 22వ తేదీన కేంద్ర మంత్రిని కలువబోతున్నామని చెప్పారు. మేం ప్రాజెక్టు పనులు పరిశీలించిన సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, కాంట్రాక్టర్ల పనితీరు చూస్తే వారి వల్ల ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని తమ పరిశీలనలో తేలిందన్నారు. గడ్కారి, కేంద్ర జలవనరుల శాఖమంత్రి పోలవరాన్ని సందర్శించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం కోసం మా పార్టీ పోరాటం చేస్తునే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌సమావేశాల్లో కూడా వీటి కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదాని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అ యిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాడుతూనే ఉంటారని చెప్పారు. తుది అంశంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని మా అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇదివరకే చెప్పినట్లుగా మేం కట్టుబడి ఉన్నామన్నారు. ఎప్పుడు అవసరమని మాఅధ్యక్షులు ఆదేశిస్తే అప్పుడు మేం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top