యువభేరి విజయవంతం

కర్నూలుః యువభేరి కార్యక్రమం విజయవంతమైంది. కర్నూలు నగర శివారులోని వీజేఆర్ కన్వెషన్ సెంటర్ లో ప్రత్యేకహోదాపై విద్యార్థులు, యువత గర్జించారు. 
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హోదా ఆవశ్యకతను విద్యార్థులకు చాటిచెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బంగాళాఖాతంలో కలిపేద్దామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. హోదా వచ్చేదాకా కలిసికట్టుగా పోరాడుదామని యువతకు సూచించారు.  ఈసందర్భంగా  విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. యువభేరి ముగిసిన అనంతరం స్థానిక పార్టీ నాయకులు  వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వైయస్ జగన్ ప్రత్యేకహోదా పాటల సీడీ ఆవిష్కరించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు విద్యార్థినీ విద్యార్థులు ఎగబడ్డారు. 

తాజా ఫోటోలు

Back to Top