వైయస్‌ఆర్‌ పథకాలకు‌ కాంగ్రెస్ తూట్లు: కొండా సురేఖ

వరంగల్‌, 2 సెప్టెంబర్‌ 2012 : మహానేత వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణవార్త విని తట్టుకోలేక అసువులు బాసిన అభిమానులకు కాంగ్రెస్‌ పార్టీ మొండిచేయి చూపించిందని మాజీ మంత్రి, వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకురాలు కొండా సురేఖ విమర్శించారు. వైయస్‌ఆర్ రెక్కల కష్టంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రె‌స్ ‌పార్టీ ఆయనను, ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. జననేత వైయస్‌ఆర్ మూ‌డవ వర్ధంతి సందర్భంగా వరంగల్‌లోని జిల్లా కలెక్టరేట్ వద్ద వైయస్ఆర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ సర్కార్ తుంగలో తొక్కుతోందని కొండా సురేఖ ‌ఆవేద వ్యక్తం చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనాన్ని పూర్తి చేయకుండా రాష్ట్ర సర్కార్‌ తాత్సారం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. తండ్రికి అర్పించకుండా జగన్మోహన్‌రెడ్డిని అడ్డుకోవడం ఈ ప్రభుత్వం దమననీతికి అద్దం పడుతోందని సురేఖ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top