జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా సత్తా చూపుతాం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ గురువారం లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చర్చించారు. 
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసి సత్తా చూపుదామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని  పొంగులేటి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదామని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

తాజా వీడియోలు

Back to Top