తూ.గో. జిల్లాలో ప‌న్ను పోరు ఉధృతం

  • సామాన్యులపై పెనుభారం మోపిన సర్కార్
  • అన్ని మండల కేంద్రాల్లో వైయస్సార్సీపీ ఆందోళన
  • ప్రభుత్వం ప్రజల్ని పీడించుకుతింటుందని ఆగ్రహం
  • పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • అధికారులకు వినతిపత్రం అందజేసిన వైయస్సార్సీపీ నేతలు
కాకినాడ(రూరల్))పన్నుల పెంపును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. అన్ని మండల కేంద్రాల్లో నాయకులు నిరసన చేపట్టారు. కాకినాడ రూరల్ లో  జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు  ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఓ , ఎం.డి. ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఇదే క్రమంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్స్ గిరజాల వీర్రాజు (బాబు ),ఆకుల వీరాజు రూరల్ ఆధ్వర్యంలో  రాజమండ్రి రూరల్, కడియం మండల గ్రీవెన్ సెల్ ప్రత్యక అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. మండపేట  నియోజకవర్గంలో కో-ఆర్డినేటర్స్ వేగుళ్ళ లీలాకృష్ణ,పట్టాభి రామయ్య చౌదరి ఆధ్వరంలో పార్టీ నాయకులు మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరం మండల కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందించారు.​

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రభుత్వం విచ్చలవిడిగా పన్నులు పెంచడంపై మండిపడ్డారు. పన్నులు కట్టకపోతే పెన్షన్, రేషన్ ఆపేస్తామని బెదిరించడం దారుణమన్నారు. గతంలో 100 ఉన్న ఇంటిపన్ను ప్రస్తుతం వేయి , 14 వందలకు చేరుకుందని అన్నారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇంటిపన్నులు పెంచడం ఏవిధంగా న్యాయమని ప్రశ్నించారు. నీటిపన్ను వేయడానికి మీకు హక్కు ఎక్కడుందని, కుళాయిలు వేయకుండా పన్ను ఎలా వేస్తారని నిలదీశారు. లైబ్రేరియన్ లు కట్టకుండా, ఉన్న వాటిల్లో పుస్తకాలు పెట్టకుండా పన్నులు ఎలా వేస్తారని బాబు సర్కార్ ను తూర్పారబట్టారు. డ్రైనేజీ పన్ను వేయడం సిగ్గుచేటని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. వీధి దీపాలు వేయకుండా సామాన్యులపై పన్నుల భారం వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం పన్నులు పెంచి చంద్రబాబు సర్కార్ ప్రజల్ని పీడించకుతింటోందని నిప్పులు చెరిగారు. బాబుకు ఎంతసేపు పబ్లిసిటీ తప్ప ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 
Back to Top