2019లోగా పోలవరం పూర్తి చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

- టీడీపీకి వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి సవాలు
– పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు వైయస్‌ఆర్‌ వారసులకే ఉంది
– దేవినేని ఉమా స్థాయి మరచి మాట్లాడుతున్నారు
– చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేతపై విమర్శలు
 
విజయవాడ: తెలుగు దేశం ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాలు విసిరారు. మంత్రి దేవినేని ఉమా కృష్ణా నది నీళ్లు తాగిన వ్యక్తి అయితే 2019 లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని, లేదంటే మీరు తప్పుకుంటారా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను పార్థసారధి ఖండించారు. సిగ్గు, శరం లేని టీడీపీ నేతలు కనీస పరిజ్ఞానం లేకుండా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు, సోనియా గాం«ధీ కలిసి వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. ఇదే విషయాలను పదే పదే ప్రస్తావిస్తే పచ్చ నేతలను ప్రజలు పేడ తీసుకుని కొడతారని హెచ్చరించారు. దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. పోలవరం పేరేత్తే నైతిక హక్కు వైయస్‌ జగన్‌కు లేదనడం సిగ్గు చేటు అన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే అన్నారు. మహానేత తనయుడిగా పోలవరం గురించి మాట్లాడే హక్కు వైయస్‌ జగన్‌కే ఉందన్నారు. మంత్రి దేవినేని ఉమా పోలవరంతో సంబంధంలేని విషయాలను ప్రస్తావిస్తున్నారని, టీడీపీకి పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రమంతా కరువుతో అల్లాడిందన్నారు. గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంటే మహానేత స్పందించి పోలవరానికి శ్రీకారం చుట్టారన్నారు. దేవినేని ఉమాకు సిగ్గు ఉంటే గతం గురించి ఆలోచించగలిగితే..కృష్ణా డెల్టా గురించి ముసలి కన్నీరు కార్చే నాయకులు పులిచింతల ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలువలేదో సమాధానం చెప్పాలన్నారు. 1996 ఏప్రిల్‌లో సీడబ్ల్యూసీ అనుమతిస్తే..ఎందుకు టెండర్లు పిలువకుండా చంద్రబాబు ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఫైర్‌ అయ్యారు. కృష్ణా yð ల్టాపై ఏమాత్రం ప్రేమ ఉంటే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించి ఉంటే మేలు జరిగేదన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించే రూ.150 కోట్లలో మీకు ముడుపులు రావని, మీ సీఎంకు లంచాలు రావని ఇవ్వలేదన్నారు. కనీస రాజకీయ జ్ఞానం లేకుండా వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీ మంత్రులు నోటికివచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఉమా తాను చేసే బ్రోకరిజాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞం అని విమర్శలు చేసే టీడీపీ నాయకులు దమ్ముంటే విచారణ చేయించాలన్నారు. నోరు, నవరంద్రాలు మూసుకొని టీడీపీ మంత్రులు బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

– పోలవరంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదన్నారు. నది గర్భం నుంచి నీటిని వెళ్లకుండా డయాఫ్రం వాల్‌ కడతారన్నారు. ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత జాతికి అంకితం చేస్తారని, డయాఫ్రం వాల్‌ వేసి జాతికి అంకితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని ఎద్దేవా చేశారు. గోడలు కట్టేసి ఒకసారి, స్లాబ్‌ వేసిన తరువాత మరోసారి ఇలా మాటి మాటికి గృహ ప్రవేశం చేసినట్లుగా టీడీపీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. 2019లోగా రిహాబిలిటేషన్‌తో సహా పోలవరాన్ని పూర్తి చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే మీరు తప్పుకుంటారా అని పార్థసారధి సవాలు విసిరారు. దేవినేని ఉమా కృష్ణా జలాలు తాగుతూ ఉంటే, ఈ ప్రాంతంలో పండించిన ధాన్యం తింటుంటే సవాలు స్వీకరించాలని సూచించారు. మంత్రిగా ఉండి, ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ జిల్లాకు  నీరు రాకుంటే కనీసం రైతులను ఓదార్చి, «భరోసా ఇవ్వలేని పిరికిపంద ఉమా అని విమర్శించారు. తేలు కుట్టిన దొంగళ్లా రోజు కేంద్ర మంత్రి గడ్కారిని కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవినేనికి సిగ్గు ఉంటే టీడీపీపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణకు సిద్ధమా అన్నారు. పారదర్శకంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్న దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. 

 

తాజా వీడియోలు

Back to Top