<br/>హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబును అనుసరిస్తున్న విధానాలను వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలపైనే చంద్రబాబు దృష్టి సారించారని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో చేసిందని సుజనా చౌదరి ..ఇప్పుడు మాట మార్చి ఏమీ ఇవ్వలేదని చెప్పుడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2016 సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఏమి చెప్పారో అదే ఇప్పుడు కూడా చెప్పారన్నారు. అప్పుడు జైట్లీ చెప్పిన అంశాలను స్వాగతించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మరోలా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.<br/><br/>