వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం నియమాకాలు..

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగంలో ప‌లు నియామ‌కాలు జ‌రిగాయి. వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా అడుసుమిల్లి ప్రతాప్‌కుమార్, కాలె పుల్లారావులు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్సీ కోఆర్డీనేషన్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా జి.ఉదయభాను–అరకు,శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు జిల్లాలు, ప్రేమ్‌ బాబు–విశాఖపట్టణం, అనకాపల్లి పార్లమెంటు జిల్లాలు, నక్కా రాజబాబు–కాకినాడ,అమలాపురం, రాజమ్రండి పార్లమెంటు జిల్లాలు, ఆనంద్‌ ప్రకాష్‌–నర్సాపురం,ఏలూరు పార్లమెంటు జిల్లాలు, భూపతిన అంబేద్కర్‌–మచిలీపట్నం,విజయవాడ పార్లమెంటు జిల్లాలు, పెరికల కాంతారావు–గుంటూరు,బాపట్ల, నరసరావుపేట పార్లమెంటు జిల్లాలు, కాకుమాను రాజశేఖర్‌– ఒంగోలు,నెల్లూరు పార్లమెంటు జిల్లాలు, ఎన్‌.రెడప్ప–తిరుపతి,చిత్తూరు పార్లమెంటు జిల్లాలు,పులి సునీల్‌కుమార్‌–కడప,రాజంపేట పార్లమెంటు జిల్లాలు, పెన్న ఓబులేసు–అనంతపురం, హిందూపురం,కర్నూలు, నంద్యాల పార్లమెంటు జిల్లాలు.

వైయస్‌ఆర్‌సీపీ ఎస్టీ విభాగం నియమాకాలు...
వైయస్‌ఆర్‌సీపీ ఎస్టీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కుంబా రవిబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్టీ కోఆర్డినేషన్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా కమిడి అశోక్, మేరాజోట్‌ హన్మంత్‌ నాయక్, జి.సురేంద్ర, మానుపాటి చిరంజీవి, పండా రామకృష్ణ, కె.నిరీక్షణరావు, సుగాలి వెంకటనాయక్, నాగరాజు సాకేలు నియమితులయ్యారు.

 


 
Back to Top