దళిత వ్యతిరేకి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి

విజయవాడ: దళిత సంక్షేమాన్ని చంద్రబాబు తూట్లు పొడిచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా దళితులను కించపరుస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల సబ్‌ప్లాన్‌ నిధులను దళితుల అభివృద్ధికి కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. చంద్రబాబు కుయుక్తులను దళితులెవరూ నమ్మొద్దన్నారు. తెలుగుదేశం పార్టీ దళితులకు వ్యతిరేకమని పలు సందర్భాల్లో నిరూపణ అయిందన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి టీడీపీ కార్యకర్తల వరకు అంతా దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. దళిత వ్యతిరేకి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ తిరిగొస్తుందన్నారు. 
Back to Top