ఉరవకొండ రైతు ధర్నాలో బాబుపై ఎమ్మెల్యే ఫైర్

ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఉరవకొండ పట్టణంలో క్లాక్‌టవర్‌ సర్కిల్‌ వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు విదేశీ పర్యటనపై ఉన్నంత శ్రద్ధ రైతుల సమస్యలపై లేదన్నారు. రైతులకు గిట్టబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతులను అన్నింటా మోసం చేస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూరెన్స్, పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు ధర్నాకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top