గుత్తి: గుంతకల్లులోని వివేకానంద ఎంసీఏ కళాశాలలో జూన్3న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి చెప్పారు. పట్టణంలోని ఆర్‌బీ బంగ్లాలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 10 వేల మందితో ప్లీనరీ చేపడతామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్ర, జిల్లా నాయకులందరూ హాజరు అవుతారన్నారు. పార్టీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డి, మైనార్టీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి మర్తాడు అన్సార్, ఎస్సీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, ఫారూక్, రంగస్వామి, మండల సీనియర్‌నాయకులు నిర్మల, చింతకాయల రంగస్వామి, చెరువు రంగస్వామి, హనుమంతు, ధర్మాపురం శీనా, వెంకటేశ్వరెడ్డి, గొందిపల్లి రంగయ్య, వెంకటరాముడు, లాలు నాయక్, గోపాల్‌రెడ్డి, పీటా, రంగ ప్రసాద్‌రాయల్, ప్రసాద్‌గౌడ్, బేతాపల్లి నారాయణ, రషీద్, జాఫర్, ఇనయతుల్లా, ఇబ్రహీం, సౌదీ సాదిక్, యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.