రాజ్యసభలో హోరెత్తిన హోదా నినాదం

న్యూఢిల్లీ: రాష్ట్రానికి
ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో  జంతర్ మంతర్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష
జరుగుతున్న సమయంలోనే  రాజ్య సభలో పార్టీకి
చెందిన సభ్యులు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నిరసన తెలియచేశారు.
హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని,
విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చారని ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి
నిరసనల మధ్యనే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. కాగా అంతకు ముందు మాజీ ఎంపిలు
పార్లమెంటు అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రానికి
ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బొత్స
సత్యనారాయయణ, వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top