చేతులు జోడించి సహకరించాలని కోరాం

ఢిల్లీ: ఐదు కోట్ల ఆంధ్రప్రజల సమస్యపై లోక్‌సభలో మాట్లాడేందుకు సహకరించండి అని టీఆర్‌ఎస్, ఏఐడీఎంకే సభ్యులను చేతులు జోడించి నమస్కరించి కోరడం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లోక్‌సభ వాయిదా అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం చదివినప్పుడు రెండు నిమిషాలు సహకరించాలని సభ్యులను కోరడం జరిగిందన్నారు. సభ్యులు సహకరించకపోవడంతో సభ వాయిదా పడిందన్నారు. అయినా హోదా పోరాటం ఆగదన్నారు.  మూడోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top