<br/><strong>విజయసాయిరెడ్డి ట్వీట్</strong>అమరావతి: టీడీపీ అంటే తెలుగు ప్రజలను దోచుకునే పార్టీ అని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో యువతకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ..ఏపీ ప్రజలకు ఇచ్చిన లక్ష ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడిస్తావని ప్రశ్నించారు. పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టి కోట్లాది రూపాయలు అప్పన్నంగా ముట్టజెప్పారని, అక్రమాలపై కేంద్రం దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆయన కోరారు.