చంద్రబాబు చేష్టలకు ఆంధ్ర ప్రజలు సర్దుకుపోతున్నారు..



ఆంధ్ర ప్రజలంతా మీ ధన్యవాదాలు చెబుతున్నారు చంద్రబాబు గారు అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పుట్టిన పిల్లలకు మీ పేరు పెట్టమని జీవో జారీ చేయనందుకు, 68 ఏళ్ల వయసులో మానసిక సమస్యలతో మీరు తర్కం లేకుండా మాట్లాడటం సహజమేనని సర్దుకుంటున్నారని ట్విట్‌ చేశారు.

‘పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు’ అని సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు ఇటీవ‌ల సూచించిన విష‌యం విధిత‌మే.  జీతాలు పెంచినందుకు ప్రతిఫలంగా తనకు అండగా ఉండాలని ఆయ‌న కోరారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనం  సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీమంతాలు, అన్నప్రాసనలు చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధులను కంట్రోల్‌ చేస్తున్నానని, సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. తల్లీ, బిడ్డలను ఆర్యోగంగా ఉంచాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదేనని పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ ట్విట్ట‌ర్‌లో కామెంట్ చేశారు. 

పుట్టిన పిల్లలకు తన పేరు పెట్టమని జీవో జారీ చేయనందుకు ఏపీ ప్రజలంతా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు. 68 ఏళ్ల వయసులో మానసిక సమస్యలతో సతమతవుతున్న చంద్రబాబు.. తర్కం లేకుండా మాట్లాడటం సహజమేనని ప్రజలు సర్దుకుంటున్నారని ఆయన విమర్శించారు.

ఇంకా ఏ తల్లిదండ్రులైన వారి పిల్లలకు దేశభక్తుల గురించి, వీరుల గురించి, దేవుళ్ల గురించి చెప్పాలని అనుకుంటారని తెలిపారు. మీలాంటి వారి గురించి చెప్పడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు టీవీల్లో కనబడితే పిల్లలు చూడకూడదని తల్లిదండ్రులు వెంటనే ఛానల్ మారుస్తారని విమర్శించారు.





Back to Top