నాలుగేళ్లు గాడిదలు కాశావా బాబూ?


ఎమ్మెల్యే శ్రీనివాసులు
హైదరాబాద్‌:  విభజన చట్టంలో కడపకు ఆరు నెలల్లో ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని పేర్కొంటే..చంద్రబాబు బీజేపీతో నాలుగేళ్లు కలిసి పని చేసి గాడిదలు కాశారా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు  ప్రశ్నించారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారే తప్ప..జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు. జననేతపై హత్యాయత్నం చేసిన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు..వైయస్‌ఆర్‌ జిల్లాలో నిన్న నిర్వహించిన ధర్మా పోరాటంలో ఏదైన మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలు ఎదురు చూశారని, చంద్రబాబు ఎక్కడా కూడా రాయలసీమకు మంచి చేస్తానని చెప్పలేదన్నారు. విభజన హామీల్లో కడప ఉక్కు పరిశ్రమ ఆరు నెలల్లో ఇవ్వాలని ఉంటే..నాలుగేళ్లు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. కడప ఉక్కుపై చంద్రబాబు నిర్లక్ష్య దోరణి వ్యవహరించారన్నారు. ధర్మపోరాట వేదికపై వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దాడికి దిగడం బాధాకరమన్నారు. రాయలసీమలో ఇంత కరువు తాండవిస్తుంటే, గిట్టుబాటు ధర లేకుంటే ..మీ ప్రభుత్వం, వ్యవసాయమంత్రి సోదిరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆరు నెలల రిపోర్టులో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా లేదని చెప్పారని, ఇలాంటి పరిస్థితిలో రైతులను ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దాడికి దిగడం దుర్మార్గమన్నారు. నిన్నటి సభలో మీ మాటలకు ప్రజల్లో ఎలాంటి స్పందన లేదని వెల్లడైందన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే సానుభూతి చూపకుండా టీడీపీ నేతలు తిట్టడం చూసి ఈ జిల్లా ప్రజలు బాధపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడ ఉండరన్నారు. విభజన హామీలను తుంగలో తొక్కారని, కరువు రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ధర్మపోరాటం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు డిక్షనరీలో ధర్మం అనే పదమే లేదని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు రాజకీయాలు తప్ప..ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని వివరించారు. దొరికిందంతా దోచుకోవడం ఇతరులపై నెట్టడమే టీడీపీ నేతల పని అని విమర్శించారు. ఇకనైనా దోపిడీ పనులు మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించాలని కొరముట్ల శ్రీనివాసులు సూచించారు. 
 
Back to Top