పార్టీలకతీతంగా వైయస్ జగన్‌ను నేతలు కలిస్తే కుమ్మక్కయినట్లా..
సిట్ బృందంపై నమ్మకంలేదు..
సిబిఐ,జ్యూడిషియల్ విచారణ జరిపించాలి.
హైదరాబాద్ః వైయస్ జగన్‌పై హత్యాయత్నంపై చంద్రబాబు నోటికొచ్చినట్లు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆమె మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఏం మాట్లాడాల్లో తెలియక ఇప్పుడు కేసీఆర్,జనసేన అందరూ కుమ్మక్కై డ్రామాలాడుతున్నారని పిచ్చి ప్రచారం చేస్తే ప్రజల్లో నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. చేస్తున్నారన్నారు. సొంతమామనే చంపేసిన చంద్రబాబుకు మానవత్వం లేదని రాజకీయంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . కేసీఆర్,పవన్ కల్యాణ్ ఫోన్ చేస్తే వారు కుమ్మక్కు అయిపోయానట్లా అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డి, జానారెడ్డి, కోమటి రెడ్డి సిపీఎం నాయకులు మధు తదితరులు వచ్చి జగన్‌ను పరామర్శించారని వీరందరూ కుమ్మక్కు అయినట్లా అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు ఎమి జరిగిందో చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలన్నారు.దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవుడు ఉన్నాడు అని ఆనందంగా చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారన్నారు. చంద్రబాబు కోసం వైయస్‌ఆర్ తిరుపతిలో మౌన ప్రదర్శన చేశారన్నారు. వైయస్‌ఆర్ సంస్కారం అలాంటిందన్నారు. నేడు టీడీపీ కార్యకర్తలతో వైయస్ జగన్‌పై దాడులు చేయించి అభిమాని చేశాడు మాకేం సంబంధం అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఎయిర్‌పోర్ట్ కేంద్రం పరిధిలో ఉంది మాకేం సంబంధం అంటూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలు చూస్తే ఎంత కుసంస్కారి అనేది అర్థమవుతోందన్నారు. సంఘటన విచారణ చేయడానికి సిట్ బృందాని పంపించి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, గతంలో సిట్ బృందం విశాఖ భూ కుంభకోణం, తుని రైల్వే ఘటనపై విచారణ చేశారని ఏమైనా తేల్చారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్, నారాయణ కాలేజీలపై అనేక బృందాలు వేశారని కనీసం ఒకరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ఈ ఘటనను పక్కదారి పట్టించి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. .రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్న డీజీపీ,సిట్ విచారణలపై నమ్మకం లేదన్నారు. కచ్చితంగా సిబిఐ,జ్యూడిషియల్ విచారణ చేయించాలన్నారు. వాస్తవాలు కప్పి పుచ్చడానికి చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకోని బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించాలన్నారు. ఆంధ్రలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ప్రజలకు, ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించాలన్నారు.ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్‌కు ప్రభుత్వం కల్పించిన భద్రత చూస్తే ఆయనకు కిచ్చిన వాహనాలు కూడా మూలనపడిన వాహనాలు ఇచ్చారన్నారు. ఎన్నిసార్లు అవి నడిరోడ్డులో మొరాయిస్తున్న పరిస్థితి ఉందన్నారు.వైయస్ జగన్‌ను అడ్డుతొలగించుకోవలన్నా ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు .రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంకల్పయాత్ర చేస్తూ సభలు నిర్వహిస్తూంటే కనీసం 10 మంది పోలీసులను కూడా రక్షణగా ఇవ్వడంలేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేలకు రక్షణ పెంచాలన్నారు.