ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డు


చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. బుధవారం హోదా కోసం ఎందాకైనా అన్న చర్చ వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరే ప్రధాన కారణమన్నారు. ఇస్తామన్న బీజేపీ మోసం చేస్తే..ఆడగాల్సిన చంద్రబాబు ఇన్నాళ్లు అడగకుండా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదా సంజీవని కాదు..అదేమన్న బ్రహ్మపదార్థమా అన్న చంద్రబాబు ఇప్పుడు ధర్మా పోరాటం చేయడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా వల్ల బాగుపడిన రాష్ట్రాలను చెప్పాలని ఆనాడు ఎదురు ప్రశ్నించిన చంద్రబాబు ఇవాళ ఆయనే ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారంటే ఎంత నాటకమో ప్రజలు గమనించాలన్నారు. 
 
Back to Top