రామ‌మందిరంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల పూజ‌లు

శ్రీ‌కాకుళం(రావివలస):  చీపురుప‌ల్లి మండలం రావివలస గ్రామంలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో సీతారాములను వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావులు దర్శించుకున్నారు. రావివలస గ్రామంలో నిర్మించిన రామమందిరం ప్రతిష్టాపన మహోత్సవములు గత మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆఖరి రోజైన బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆలయాన్ని సందర్శించి సీతారాములను దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతం, మాజీ సర్పంచ్‌ పనస అప్పారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఐ.సతీష్, శ్రీను, లక్ష్మణ తదితరులు ఉన్నారు.

Back to Top