ఇళ్ల కేటాయింపులో అవినీతిపై వైయస్‌ఆర్‌సీపీ ధర్నా..
విజయవాడః లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ధర్నా చేపట్టింది. ఇళ్ల కేటాయింపులో అవినీతిపై వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆందోళన నిర్వహించారు. పక్కా ఇళ్లు ఇస్తామంటూ పేదల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి మండిపడ్డారు. పారదర్శకంగా అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనలో అరాచపాలన సాగుతోందన్నారు.పేదలకు ఇళ్లు ఇస్తామంటూ అక్రమాలకు పాల్పడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Back to Top