<br/><strong>రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా?</strong>విజయవాడ: రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా అని వైయస్‌ఆర్‌సీపీ అధికారప్రతినిధి పార్థసారధి, జోగి రమేష్ ప్రశ్నించారు. సాగునీరు అందించాలని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, జోగి రమేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రైతులు రైతులకు నీళ్లు ఇవ్వకుంటే ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. కనీసం వినతిపత్రం అందిస్తామన్నా..పోలీసులను పెట్టి అరెస్టులు చేయిస్తారా అని మండిపడ్డారు.