ప్రభ ఏర్పాటుకు తరలివెళ్లిన నేత‌లు

తాళ్లూరు : గుంటిగంగలో వచ్చే నెల ఏప్రిల్‌ 13న జరగనున్న తిరునాళ్లలో విద్యుత్‌ ప్రభ ఏర్పాటు చేసేందుకు మండలంలోని దోసకాయలపాడులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం దోసకాయలపాడు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలి వెళ్లి ప్రభను ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో పార్టీ జెండాలు పాతారు. వర్షాలు సంవృద్ధిగా పడి రైతులు చల్లగా ఉండాలని, జననేత వైయ‌స్‌ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో రాజన్న రాజ్యం రావాలని గుంటిగంగను వేడుకున్నట్లు వైయ‌స్ఆర్‌ సీపీ నేత‌లు తెలిపారు. ర్యాలీగా త‌ర‌లివెళ్లిన వారిలో నాయకులు కోట వెంకటరామిరెడ్డి, యండ్రపల్లి వేణుగోపాల్‌రెడ్డి, మేకల వెంకయ్య, బొందలకుంట పెద్దన్న, కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, మేకల ఏడుకొండలు త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top