ఉద్యమాన్ని అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్ర

గుంటూరు: ప్రత్యేక హోదా అంశాన్ని అణగదొక్కేందుకు చంద్రబాబు పోలీసులతో పోరాటాలను అణగదొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. గుంటూరు ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఏపీ బంద్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు, ధర్నాలు, బంద్‌లు, ఆమరణ దీక్ష, ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు ఇప్పటికీ అదే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. అందుకే ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని దుయ్యబ్టటారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రజలంతా స్వచ్ఛందంతా తరలివచ్చి బంద్‌లో పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకొని హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని కోరారు. 
Back to Top