హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓటుకు నోటు వ్యవహారంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.