బాధితునికి వైయస్‌ఆర్‌సీపీ నాయకుల ఆర్థిక సాయం

జొన్నగిరి(తుగ్గలి) : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రఘుకు శనివారం ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిల్‌ జగన్నాథరెడ్డి ఆర్థిక సాయం అందించారు. రెండు నెలల క్రితం తుగ్గలి–రాతన గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో రఘు తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలులో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథరెడ్డి బాధితుని ఇంటికి వెళ్లి రూ.50వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే రాతన గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఉమామహేశ్వరరెడ్డి రూ.5వేలు నగదును అందజేశారు. రఘు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి, మండల కన్వీనర్‌జిట్టా నాగేష్, మండల ప్రధాన కార్యదర్శి కావలి శ్రీనివాసులు, పగిడిరాయి మాజీ సర్పంచ్‌జనార్ధన, గోవిందు, రంగయ్య, రంగస్వామి, బుడ్డరంగన్న, కె.రంగన్న, ఆంజినేయులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top