అక్రమ అరెస్ట్ లకు వ్యతిరేకంగా ధర్నా

గుంటూరుః  వైయస్సార్సీపీ నాయకులు పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వైయస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుందుర్తి గురవాచారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టులో హాజరుపరచకుండా తిప్పుతున్నారని, అదుపులోకి తీసుకుని రెండు రోజులైనా అతని జాడ ఇంకా తెలియలేదని ఆందోళనకు దిగారు. గురజాలలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై గురువాచారి కోర్టులో పిల్ వేసిన సంగతి తెల్సిందే. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Back to Top