రాములు మ‌ర‌ణం తీర‌ని లోటు

ప‌శ్చిమ గోదావ‌రి (దెందులూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ములకాల రాములు మరణం పార్టీకి తీరని లోటని  పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు అన్నారు.  ఇటీవల మృతి చెందిన రాములు కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులను గురువారం కొఠారు, మండల కన్వీనర్‌ బొమ్మనబోయిన నాని, శ్రీరామవరం పోస్టు మాస్టర్‌ కామిరెడ్డి ఆనంద్‌బాబు, నాయకులు డాక్టర్‌ సోమరాజు, చల్లారి గోపి, తాడేపల్లి రాజేష్‌లు పరామర్శించారు.  తొలుత రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పార్టీ అన్ని రకాలుగా ఆదుకోవటంతో పాటు ప్రభుత్వ పరంగా వచ్చే సహాయ, సహకారాలు త్వరితగతిన అందేందుకు కృషి చేస్తామన్నారు. 

Back to Top