గుంటూరు: నారా హమారా..టీడీపీ హమారా సభలో ముస్లింల అరెస్టుపై బాధితుల తరఫున వైయస్‌ఆర్‌సీపీ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 22న విచారణకు హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఇక్బాల్, రేహ్మన్, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మంగళవారం హెచ్‌ఆర్‌సీని కలిశారు. అక్రమంగా అరెస్టు చేసినందుకు పోలీసులను సస్పెండ్ చేయాలని, బాధితులకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తే అరెస్టు చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు.