ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పొత్తా..

అధికార దాహంతో చంద్రబాబు సిగ్గులేని రాజకీయాలు..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ  తీరని అన్యాయం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని చంద్రబాబు కలవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిన చంద్రబాబు..రాహుల్‌తో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా కనుగోలు చేసిన చంద్రబాబా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అని మండిపడ్డారు.ఎన్టీఆర్‌కు ఏవిధంగా వెన్నుపోటు పోడిచావో రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు.అధికార దాహంతో సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏనాడు కూడా ఒంటరిగా పోటి చేసిన పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలవడం అనైతికమన్నారు.ఎవరి చెవ్వులో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తర్వాత రెండు సార్లు చంద్రబాబు ఢిల్లీకి చంద్రబాబు వెళ్లారన్నారు.ఈ దాడి ఘటన ఎక్కడ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందోనని భయంతో హత్యాయత్నం ఘటన  నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడడానికి చెప్పి డ్రామాలాడుతున్నారన్నారు.ప్రకాశం జిల్లా ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలకు వెలుగు నింపాలంటే వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2006లో వెలుగొండ పనులు ప్రారంభించారన్నారు.సుమారుగా 60 శాతం పనులు పూర్తిచేయించారన్నారు.టీడీపీ హయాంలో కేవలం 40 శాతం పనులు పూర్తిచేయలేక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి తుంగులో తొక్కారన్నారు.రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెబుతారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.
 
Attachments area
Back to Top