బాబు అసమర్థత వల్లే నీటి కష్టాలు

నాలుగున్నరేళ్లలో చేయలేనిది నాలుగు నెలల్లో ఎలా చేస్తారు
వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలుగొండ పూర్తి

ప్రకాశం: చంద్రబాబు అసమర్థత వల్లే ప్రకాశం జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు వచ్చాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం చేరుకుంది. పాదయాత్రలో వైవీ వెంట ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా వెలుగొండ ప్రాజెక్టును పట్టించుకోని చంద్రబాబు నాలుగు నెలల్లో పనులు ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు సొరంగం పనులు ఇప్పటి వరకు 1.5 కిలోమీటర్లు మాత్రమే జరిగాయని, నాలుగు నెలల్లో ఇంకా 3.5 కిలోమీటర్ల పనులు ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. వారి కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే రేపు మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏడాదిలో పూర్తి చేసుకుందామన్నారు. 
Back to Top