న్యూఢిల్లీః చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత వరప్రసాద్ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించలేదని, కనీసం ఖండన కూడా తెలపలేదని విమర్శించారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిందని రిమాండ్ రిపోర్టు తేటతెల్లం చేసిందన్నారు. విచారణను నీరుగారుస్తూ కేసును పక్కదారి పట్టిసున్నారని విమర్శించారు. వైయస్ జగన్‌ను వాడూవీడూ అంటూ గౌరవం లేకుండా మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ నాయకులు రౌడీలా ప్రవర్తిస్తున్నారని,.హంతకులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సిట్‌పై నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున స్వతంత్ర సంస్థచే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.