<br/>విజయవాడ: వైయస్ జగన్‌పై జరిగిన దాడిని చూస్తే మొదటి నుంచి కూడా చంద్రబాబు, ఆయన తొత్తులు చేస్తున్న పత్రిక ప్రకటనలు, వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వీరు బాధ్యులు కారా అన్న అనుమానం వస్తుందన్నారు. మొదటి నుంచి కూడా సీఎంది కాకుండా డీజీపీ వ్యవహరించిన తీరు కూడా దీనిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 12.20 గంటలకు సమయంలో ఘటన జరిగితే గంటలోనే డీజీపీ మీడియాతో నిందితుడి ఫొటోను, ఫ్లెక్సీని, అతని కులాన్ని ప్రస్తావిస్తూ ఇదో చిన్న విషయంగా ప్రస్తావించారన్నారు. జరిగిన సంఘటనను బాధ్యత వహించాల్సింది పోయి తప్పించుకునేందుకు బాద్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.