<strong>మరో రెండురోజుల్లో ఏజెన్సీలోకి వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర </strong><strong>మళ్లీ రాజన్న పాలన రాబోతుంది..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత పరిక్షిత్ రాజు</strong>విజయనగరంః రెండు రోజుల్లో వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలోకి ప్రవేశింపబోతుందని వైయస్‌ఆర్‌సీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పరిక్షిత్ రాజు అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి కోసం గిరిజనులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలు మెరుగుపడడంలేదన్నారు. విషజ్వరాలతో మరణాలు సంభవిస్తున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు .ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరిన టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. వైయస్‌ఆర్‌సీసీ ఉద్యమాలు చేస్తే తూతూమంత్రంగా మంత్రులు ఏజెన్సీలో పర్యటించి చేతులు దులుపుకున్నారన్నారు. వైయస్ జగన్‌ను దృష్టికి విద్య,వైద్య,రోడ్డు సమస్యలను తీసుకెళ్ళడానికి గిరిజనులు ఎదురుచూస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజనులు సుభిక్షంతో ఆనందంగా ఉన్నారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి వస్తే వైయస్‌ఆర్ పాలనకు ధీటుగా పాలన అందిస్తారన్నారు.