వైయస్‌ జగన్‌ హత్యకు టీడీపీ కుట్ర

వైయస్‌ఆర్‌సీపీ నేత నాగిరెడ్డి
విశాఖపట్నంః ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ను హత్యచేయాలనే దురుద్దేశ్యంతోనే ఆయనపై దాడి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత నాగిరెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ గొంతు కొయాలని  ప్రయత్నించాడని అదృష్టవశాత్తూ భుజానికి తగిలి  ప్రాణాపాయం తప్పిందన్నారు. ఈ దాడికి  తెలుగుదేశం ప్రభుత్వమే కారణమన్నారు. కుట్రపూరితంగా వైయస్‌ జగన్‌ను హత్యచేయడానికి ప్రయత్నం జరిగిందన్నారు.   ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌ క్యాంటీన్‌ తెలుగుదేశానికి చెందిన వ్యక్తిది కావడం అందులో పనిచేస్తున్న వ్యక్తే హత్యకు ప్రయత్నించడం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు.
 

Back to Top