సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు..

విశాఖ‌:  హోటల్‌ వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి వైయ‌స్‌ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. వైయ‌స్‌ జగన్‌ సరేననడంతో..  ‘మీరు కాబోయే ముఖ్యమంత్రి’ అంటూ నవ్వూతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్‌ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. ఊహించని ఘటన ఎదరుకావడంతో వైయ‌స్‌ జగన్‌ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. దీంతో కత్తివేటు వైయ‌స్‌ జగన్‌ భుజంపై పడింది. కోడి పందాల్లో ఉపయోంచే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మాటికే జగన్‌పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైయ‌స్‌ జగన్‌ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే ఏం జరిదేదో.
Back to Top