అగ్రిగోల్డ్‌పై పార్టీలకతీతంగా పోరాడతాం..

సమస్యలపై పోరాడితే అణిచివేత చర్యలా..
అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి
విశాఖపట్నంః అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉందని అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు అధికంగా ఉన్నారన్నారు. బాధితులందరికి న్యాయం జరిగే వరుకూ పోరాటం ఆగదన్నారు. ఇప్పటికే అనేక ఉద్యమాలకు కార్యాచరణ ప్రకటించామన్నారు. బాధితులకు సహాయం చేయడానికి ఏ పార్టీలు, సంస్థలు ముందుకొచ్చిన వారికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.రాజకీయ లబ్ధి ఆశించి బాధితుల తరపున పోరాడటం లేదని,బాధితులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామన్నారు.పార్టీలకతీతంగా అందరిని వైయస్‌ఆర్‌సీపీ కలుపుకుని వెళ్తుందన్నారు.బాధితుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముప్పాళ్లనాగేశ్వరరావు,విశ్వనా«ద్‌రెడ్డి,తిరుపతిరావులను అర్ధరాతి పూట దీక్ష భగ్నం చేయడం దారుణమన్నారు.ఎవరైతే సమస్యలు గురించి మాట్లాడుతున్నారో వారి గొంతునొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top