వైయ‌స్ జ‌గ‌న్‌ను సీఎం చేసుకుందాం



- వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదికే వెలుగొండ పూర్తి చేస్తాం
- ప్ర‌కాశంలో జిల్లాలో క‌రువు రక్కసిని శాశ్వతంగా పారద్రోలుదాం.
- మార్కాపురం బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన అశేష జ‌నం
మార్కాపురం: వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ప్ర‌జా పాద‌యాత్ర‌లో భాగంగా మార్కాపురం ప‌ట్ట‌ణంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. అంత‌కుముందు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడా లేని కరువు ప్రకాశం జిల్లాలో ఉంద‌ని,  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల పశ్చిమ ప్రకాశం ఎడారిగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రహించిన దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ జిల్లాకు అత్యంత అవసరమైన, ప్రజల దాహార్తి తీర్చే, రైతులకు సాగు నీరందించేందుకు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఆయన అకాల మరణంతో వెలిగొండ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి మరుగున పడిందన్నారు. ప్రాజక్టు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా లేడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. జిల్లాపై టీడీపీ వివక్ష చూపుతోందని, ప్రజలపై ఇంతటి నిర్లక్ష్యం మంచిది కాదని పాలకులకు హితవు పలికారు. ఈ కరువు తీరాలంటే అది ఒక్క వెలుగొండతోనే సాధ్యమ‌వుతుంద‌న్నారు.  రాజన్న ముద్దుబిడ్డ వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే ప్రాజక్టు పూర్తి చేస్తార‌ని చెప్పారు. దీంతో కరువు రక్కసిని  జిల్లా నుంచి శాశ్వతంగా పారద్రోలుదామ‌ని  వైవీ సుబ్బారెడ్డి  ప్రజలకు పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యే జంకె వెంక‌ట్‌రెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌,    కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వరికూటి అమృతపాణి, మందటి మహేష్‌రెడ్డి, కృష్ణా జిల్లానేత జోగి రమేష్, ఒంగోలు డేవిడ్, డా.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, పిడతల అభిషేక్‌రెడ్డి, చెన్నువిజయ, పఠాన్‌ సుభాన్‌ఖాన్, కామూరి అమూల్య శ్రీనివాసరెడ్డి,  వెంకటరాజు, లాయర్‌ శ్రీనివాసులరెడ్డి, పఠాన్‌ జఫ్రుల్లాఖాన్, బొల్లా బాలిరెడ్డి, బోయిళ్ళ జనార్దన్‌ రెడ్డి, చక్కెర బాలనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top