శ్రీకాకుళం: వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములను మావోయిస్టులు హత్య చేయడంతో తనకు భద్రత కల్పించాలని ధర్మాన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలోని పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు. ఈ విషయంలో ఎన్నిమార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించడం లేదు. కిడారి సర్వేశ్వరరావు కూడా గతంలో తనకు భద్రత కల్పించాలనిప్రభుత్వాన్ని కోరినా నిర్లక్ష్యం చేయడంతో నిండు ప్రాణాలు బలిగొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతవం కాకుండా భద్రత కల్పిస్తే ప్రజాప్రతినిధులకు రక్షణ కలుగుతుందని పలువురు కోరుతున్నారు.