<br/><strong>ఎన్నికల కమిషనర్‌కు వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు</strong>గుంటూరు: గురజాల నియోజకవర్గంలో ఓట్లు గల్లంతుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్‌రెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..టీడీపీ ఎప్పుడూ దొంగ ఓట్లతో గెలవాలనే భావనలో ఉంటుందని మండిపడ్డారు. టీడీపీ అనుకూల ఓట్లను ఉంచి, వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయన్నారు. గతంలో నరసరావుపేటలో 43 వేల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. యరపనేని గురజాలలో దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు టీడీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. న్యాయం జరుగకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉమ్మారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.