ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది


శ్రీకాకుళం: చంద్రబాబు అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్న పాలన, గతంలో జరిగిన వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. కళ్లబొల్లి మాటలు చెప్పే నాయకులు వస్తున్నారని, వారిని నిలదీయాల్సిన సమయం ఉందన్నారు. ఆ రోజు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పార్టీలకు అతీతంగా వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చారన్నారు. ఈ రోజు పసుపు చొక్కా వేసుకున్నవారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అలాంటి పాలనకు చరమ గీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక పరిశ్రమలు ఉన్నాయని, 27 కిలోమీటర్ల తీర ప్రాంతం కూడా ఉందన్నారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ఇవన్నీ అభివృద్ధి కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. ఈ రోజు ఉపాధి నిధులను పచ్చచొక్కాలు దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు పేదలకు అందడం లేదన్నారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ఎచ్చెర్ల యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. 
 

తాజా వీడియోలు

Back to Top