స్వార్థ ప్రయోజనాల కోసమే వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం





– డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నాం
– స్వతంత్ర విచారణ సంస్థతోనే విచారణ జరిపించాలి
– రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ను కలుస్తాం
– వైయస్‌ జగన్‌ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని విజ్ఞప్తి

 హైదరాబాద్‌: స్వార్థ ప్రయోజనాల కోసమే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని పార్టీ తీవ్రంగా ఖండించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం పార్టీ సీనియర్‌ నేతల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలను భూమన కరుణాకర్‌రెడ్డి, పార్థసారధి, అంబటి రాంబాబు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన మా నాయకులు వైయస్‌ జగన్‌పై అత్యంత అమానుషంగా, అరాచకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండించామన్నారు. ఈ హత్య ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా, రాజకీయదురుద్దేశంతో, స్వార్థప్రయోజనాల కోసం మా నాయకుడిని నిర్మూలించేందుకు చేసిన ఘటనగా ఆక్షేపిస్తూ ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సీఎం, డీజీపీ ఠాగూర్‌ చర్యలను, మాట్లాడిన తీరును చాలా గర్హనీయమైనదిగా, ఆక్షేపించదగినదిగా ఉండటంతో వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ హత్యాయత్నంపై సరైన విచారణ జరగాలంటే ఓ స్వాతంత్య్ర దర్యాప్తు సంస్థ ద్వారా నిజాలు బయటకు వస్తాయని, రాష్ట్రప్రభుత్వం చెప్పిన సిట్‌ దర్యాప్తు సంస్థతో కాకుండా స్వాతంత్య్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేయించాలని డిమాండు చేశారు. ఈ అమానవీయనమైన ఘటనపై ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 9 కోట్ల తెలుగు ప్రజలు నిర్ఘాంతపోయారన్నారు. జరుగుతున్న పరిణామాలపై, ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యాలనాలపై మాకు న్యాయం జరగాలన్న విషయంపై మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్యనాయకులందరూ కూడా రాష్ట్రపతిని, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి న్యాయం చేయాలని నివేదించాలని ని ర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా నాయకుడికి దాడిలో అయిన గాయం కారణంగా ఆయన ప్రజల కోసమని తపించే గుణం మిగత ఎవరికి లేనంతగా ఉందని, గాయం నొప్పిస్తున్నా పాదయాత్ర చేసేందుకు ఆసక్తి చూపడంతో,,కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని మా నాయకుడిని కోరినట్లు చెప్పారు.  మా నాయకుడిని నిర్మూలించాలని జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర ్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని విమర్శించారు. 

ఎల్లోమీడియా వార్తలను ఖండిస్తున్నాం: పార్థసారధి
వైయస్‌ జగన్‌పై జరిగిన  ఘటన పై అవాస్తవ కథనాలు వస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్లు పార్థసారధి చెప్పారు. సీఎం, డీజీపీ దురుద్దేశపూర్వకంగా వారి అభిప్రాయాలు వెల్లడించారని, తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నిష్పాక్షపాత దర్యాప్తును కోరుకున్నట్లు చెప్పారు. 

చంద్రబాబు మాటలు అభ్యంతరకరం:    రాంబాబు
చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ ఇవాళ కొన్ని ట్వీట్లు చేశారని, అందులో ఆయన పేర్కొన్న భాషా అభ్యంతరకరమన్నారు. చంద్రబాబు బాధ్యత కలిగిన వ్యక్తే నిన్న ప్రెస్‌మీట్లో అసభ్యకరంగా మాట్లాడారని, ఆయన కుమారుడు లోకేష్‌ బాగా మాట్లాడుతారు అనుకోవడం పొరపాటే అన్నారు. అధికారులను కించపరుస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని నారా లోకేష్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీకి మంత్రిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. డీజీపి సక్రమంగా వ్యవహరించలేదని నిన్న సాయంత్రం మేం స్పష్టం చేశామన్నారు.కోడి కత్తి వెనుక ఉన్న డ్రామా బయటపడుతుందని, మోడీ బ్యూరో ఇన్వేస్టిగేషన్‌ ద్వారా బయటపడుతుందని ఆయన పేర్కొనడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఇంతవరకు ఎన్నో సిట్‌ కమిషన్లు ఏర్పాటు చేయించారని, వాటికి సంబంధించిన ఒక్కటి కూడా ఇంతవరకు నివేదిక రాలేదన్నారు. చంద్రబాబు మసి పూసి మారడుకాయ చేయడం కొత్తమే కాదు అన్నారు. మమ్మల్ని కించపరిచే విధంగా నీచమైన ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని, మాకు ఆ ఖర్మ పట్టలేదని, ఇలా పొడిపించుకోవాల్సిన అవసరం అంతకన్న లేదన్నారు. ముద్దాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కచ్చితంగా ఈ ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే సీఎం పీఠంపై కన్నేశారని లోకేష్‌ పేర్కొనడం విచారకరమన్నారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి  మరణాంతరం వైయస్‌ జగన్‌ ఎంతో కష్టపడి ప్రజల మధ్య ఉంటూ వారికి తోడుగా ఉన్నారని చెప్పారు. నారా లోకేష్‌ తన చేతిలో ట్విట్‌ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు రాస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తండ్రి కొడుకులు..ఆవు దూడలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.




 
Back to Top