‘వంచనపై గర్జన’ కు వేలాదిగా తరలి రావాలి

  

 కాకినాడ :  రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన కాకినాడలో ‘వంచనపై గర్జన’సభ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వంచనపై గర్జన సభలు జరిగాయి. ఐదో సభగా కాకినాడలో నిర్వహిస్తున్న వంచనపై గర్జనకు వేలాదిగా  తరలి రావాలని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంచనపై గర్జన దీక్ష వేదిక ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. బాలాజీ చెరువు సెంటర్‌లో ఈ నెల 30న  ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వంచనపై గర్జన దీక్ష ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.


దీక్షలో వైయ‌స్ఆర్‌  అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలలతో పాటు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు తరలివస్తారన్నారు. ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకే ఈ దీక్షను చేపడుతున్నామని చెప్పారు. దీక్ష వేదిక ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో సుబ్బారెడ్డితో పాటు, కోఆర్డినేటర్ లు ద్వారంపూడి, పెండెం దొరబాబు,దవులూరి దొరబాబు,పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి, నగర అధ్యక్షులు ఫ్రూటీ కుమార్‌ తదితరులు ఉన్నారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top