మిషన్ కాకతీయలో అవినీతికి ఆస్కారమివ్వొద్దు: వైఎస్సార్‌సీపీ

హైదరాబాద్:  చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ కార్యక్రమం కమీషన్ కాకతీయ, గ్రాండ్ కాకతీయగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు ప్రయోజనం కలిగించేవిధంగా కమీషన్ల వ్యవహారంగా, పార్టీ కార్యక్రమంగా ముద్రపడకుండా చూడాలని సూచించింది. మంగళవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు.
Back to Top