బీసీల నిర‌స‌న ర్యాలీకి విశేష స్పంద‌న‌

 అమరావతి: బీసీలను అన్ని రకాలుగా అణచివేతకు గురిచేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీకి విశేష స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే అన్ని జిల్లాల్లోని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బీసీల ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని ముక్త కంఠంతో నినదించారు. నిరసన ర్యాలీలు జిల్లాల వారీగా..

విజయవాడ: బీసీల కష్టాలు తీరాలంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. గురువారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీసీలను పదేపదే మోసగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటుతో తగిన గుణపాఠం చెబుదామన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో వుండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని ఎద్దేవా చేశారు.


వైయ‌స్ఆర్‌ జిల్లా:  చంద్రబాబు బీసీలకు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా స్థానిక వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరాగం రెడ్డి సుబ్బారెడ్డి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


అనంతపురం: ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకిచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ఓటుతో గుణపాఠం చెబుతామని అనంతపురం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు, ఇతర సంఘాల నేతలు హెచ్చరించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గురువారం తలపెట్టిన నిరసన ర్యాలీ దిగ్విజయంగా సాగింది. ఈ ర్యాలీలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి రంగయ్య, కళ్యాణదుర్గం సమన్యయకర్త ఉషాశ్రీ చరణ్‌,  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరుశురాం, కృష్ణప్ప, రాష్ట్ర కార్యదర్శులు బోయతిప్పే స్వామి, పైలా నరసింహయ్య, గిర్రాజు నగేష్‌, పెద్ద ఎత్తున కార్యకర్తలు  పాల్గొన్నారు. 


కర్నూలు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద నిరసన క్యార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీవై రామయ్యా, చెరుకులపాడు శ్రీదేవమ్మ, హఫీజ్‌ ఖాన్‌, ప్రదీప్‌ రెడ్డి, నరసింహులు యాదవ్‌, తెర్నకల్‌ సురేందర్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

నంద్యాల: టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల మోసపూరిత విధానాల పట్ల నిరసనగా నంద్యాలలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, కర్ర హర్షవర్దన్‌ రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్ర రెడ్డి, దేశం సులోచన, సిద్దార్థ రెడ్డి, పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి: సీఎం చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీకి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వినూత్న నిరసనకు దిగారు. ఈ మహా ర్యాలీకి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నేతలు గోపి యాదవ్‌, పురుగు బాబు యాదవ్‌, పుల్లయ్య, వాసు యాదవ్‌, ఎస్కే బాబు, పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేశారు.

 

విశాఖపట్నం: టీడీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఎల్‌ఐసీ జంక్షన్‌ నుంచి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి ఆ పార్టీ నగర అధ్యక్షుడు విజయ ప్రసాద్‌, బీసీ విభాగం అధ్యక్షుడు రామన్న పాత్రుడు, పార్టీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు, నాగిరెడ్డి, అక్కరమాని విజయ నిర్మల, డాక్టర్‌ రమణ మూర్తి, సీనియర్‌ నాయకులు తైనాల విజయ్‌ కుమార్‌, కొయ్య ప్రసాద్‌ రెడ్డి, జాన్‌ వెస్లీ, పక్కి దివాకర్‌, రొయ్య వెంకట రమణ, మహిళా కన్వీనర్‌ గరికిన గౌరి, శీదేవి వర్మ, సాగరిక, పార్టీ కార్యకర్తలు,  వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

Back to Top