సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతికి ప్రణాళికలు

హైదరాబాద్‌, 21 సెప్టెంబర్ 2013:

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడమే లక్ష్యంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉద్యమాన్ని గ్రామ స్ధాయి వరకూ తీసుకెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణతో పాటు, ప్రతి కార్యకర్తనూ ఉద్యమంలో భాగస్వామిని చేయడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు పార్టీ విస్తృతస్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముందుగా శ్రీమతి విజయమ్మ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమావేశాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు,  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చంద్రబాబు, టిడిపి నేతల వ్యవహారశైలి తదితర అంశాలపై ఈ భేటిలో కూలంకుషంగా చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేబినెట్‌ నోట్ తయారైనప్పటికీ సీమాంధ్ర కాంగ్రె‌స్ ‌నాయకులు స్పందిస్తున్న తీరు... టిడిపి ఆడుతున్న డ్రామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులూ హాజరయ్యారు.

Back to Top