వైఎస్ పథకాలు.. జగన్‌తోనే సాధ్యం: మదన్‌లాల్

వైరా: దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు బాణోత్ మదన్‌లాల్ అన్నారు. సోమవరం గ్రామంలో  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మదన్‌లాల్ సమక్షంలో చేరాయి. పార్టీ కండువాలు కప్పి వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటైన సభలో మదన్‌లాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం ఒక్క జగన్‌తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలలోని వారు వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వ పట్టించుకోవడం లేదని విమర్శించారు.  వైఎస్సార్ పాలన తిరిగి రావాలంటే వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రావడమొక్కటే మార్గమన్నారు. సభలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు, నాయకులు శీలం కరుణాకర్ రెడ్డి, ఉయ్యూరి రామకృష్ణ, పాముల వెంకటేశ్వర్లు, నల్లమల శివకుమార్, పూర్ణకంటి నాగేశ్వరావు, షేక్ లాల్‌మహ్మద్, రాయల పుల్లయ్య, సాదం రవి, పూర్ణకంటి వీరభద్రం, ఏలూరి శ్రీనివాసరావు, డాక్టర్ డి కోటయ్య, దారెల్లి అశోక్, తేలపోలు నాగేశ్వరరావు, తాళ్లూరి నాగేశ్వరరావు, కౌసర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అధికార, ప్రతిపక్షాల పలాయనం

కారేపల్లి: శాసనసభలో ప్రజల సమస్యలపై చర్చించకుండా అధికారపక్షం, ప్రతిపక్షం పలాయనం చిత్తగించాయని వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు బాణోతు మదన్‌లాల్ విమర్శించారు. పేరుపల్లి గ్రామంలో ఆదివారం పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కిరణ్ సర్కారు ఐదు రోజులపాటు శాసనసభను మొక్కుబడిగా నిర్వహించిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం కూడా అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.

రాష్ట్ర సమస్యలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని, ఇందిరమ్మ బాట పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ రైతు విభాగం జిల్లా క న్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కిరణ్ సర్కార్ అసమర్థ పాలనతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు రావూరి శ్రీనివాసరావు, ఇమ్మడి తిరుపతిరావు, మండెపూడి సత్యనారాయణ, చిలక విజయ, బుడిగ ప్రభాకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మేడ వెంకన్న, గంగరబోయిన మురళి, రామాచారి, ఎస్‌కె. సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top