<span style="text-align:justify">వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించానున్నారు. రూ.500లు, రూ.1000ల రద్దు కారణంగా రైతులు, చిరు వ్యాపారులు, కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న అగచాట్లను గవర్నర్ దృష్టికి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు. <br/></span>