పుష్క‌రాల ప‌నుల్లో అవినీతా..! వైఎస్ జ‌గ‌న్ మండిపాటు

రాజ‌మండ్రి:తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గోదావ‌రి పుష్క‌రాల కోసం జ‌రుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించారు. అవినీతి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న వైనాన్ని ప్ర‌త్య‌క్షంగా గ‌మ‌నించారు. ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌చ్చే కోటిలింగాల రేవులో ఘాట్ ల నిర్మాణం అర‌కొర‌గా జ‌ర‌గడాన్ని ఆయ‌న గుర్తించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పుష్క‌రాల ప‌నుల్లో అవినీతిపై మండిప‌డ్డారు. ఈ ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌కుండా నామినేటెడ్ ప‌ద్ద‌తిలో ప‌నుల్ని పంచుకోవటాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అందినంత దోచుకోవాల‌న్న ఆతృత బాగా క‌నిపిస్తోంద‌ని జ‌గ‌న్ అభిప్రాయ పడ్డారు. ల‌క్ష‌లాది మంది వ‌చ్చే కోటిలింగాల రేవులోనే ప‌నులు ఈ రీతిన జ‌రుగుతూ ఉంటే ఇక‌, మిగిలిన దేవాల‌యాల్లో పనులు ఏ రీతిన జ‌రుగుతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
Back to Top